News February 17, 2025
HYDలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు

HYDలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం కిలో చికెన్ రూ. 180 నుంచి రూ. 190 వరకు అమ్మారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో మాంసం ప్రియులు మటన్, చేపల దుకాణాల వైపు మొగ్గుచూపారు. ఈ ప్రభావంతో సోమవారం ధరలు తగ్గించారు. విత్ స్కిన్ KG రూ. 148, స్కిన్‌లెస్ KG రూ. 168గా ధర నిర్ణయించారు. ఫాంరేటు రూ. 80, రిటైల్ రూ. 102 ఉంది. నిన్న ఓల్డ్ సిటీలో లైవ్ చికెన్‌ను రూ. 40కే విక్రయించినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది.
Similar News
News March 11, 2026
ఈ టైమ్‌లో ఎండలో నిలబడండి..

భారతదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు విటమిన్-డి లోపంతో సతమతమవుతున్నారు. మీకు 30-100 ng/mL మధ్య ఉంటే డి విటమిన్ సరిపడా ఉందని అర్థం. సహజంగా దీనిని పెంచుకునేందుకు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కనీసం 30 నిమిషాలు ఎండలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల పుష్టికి, రోగనిరోధక శక్తికి ఈ ‘సన్ షైన్’ విటమిన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.
News March 11, 2026
అడవి వదిలి… ఊరి బాట పట్టిన వానరాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కోతుల గుంపులు ప్రజలను వణికిస్తున్నాయి. అడవిని విడిచి ఊర్ల బాట పట్టిన కోతులు, నేరుగా ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. పర్యాటక ప్రాంతాలు, ఆలయాల వద్ద భక్తులు ఇచ్చే ఆహారానికి అలవాటు పడి ఇప్పుడు అడవిలో ఆహారం వెతుక్కోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా భయాందోళన చెందుతున్నారు.
News March 11, 2026
2 రోజుల్లో ₹51,400 కోట్ల ఆయుధాలు

ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి 48 గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం సుమారు ₹51,400 కోట్ల విలువైన ఆయుధాలను వాడేసినట్లు సమాచారం. కేవలం క్షిపణులు, బాంబులకే ఇంత ఖర్చు కాగా.. సైనిక మోహరింపు వ్యయం అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయడం అమెరికా కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతటి భారీ ఖర్చుతో కూడిన యుద్ధాన్ని పెంటగాన్ ఎంతకాలం కొనసాగించగలదనే దానిపై చర్చలు మొదలయ్యాయి.


