News February 4, 2025
HYDలో యాక్సిడెంట్.. మహబూబాబాద్ డాక్టర్ మృతి

HYD మేడ్చల్ వద్ద రోడ్డు ప్రమాదంలో కంటైనర్ కింద పడి వైద్యుడు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్ పట్టణంలోని 9వ వార్డు శనిగపురం గ్రామానికి చెందిన యువ డాక్టర్ శ్రీ చరణ్ మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం ఉదయం మృతి చెందారు. శ్రీ చరణ్ ప్రస్తుతం HYD కిమ్స్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. డాక్టర్ మృతితో శనిగపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 25, 2026
నిర్మల్: మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్‌ఛార్జీలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. భైంసాకు హైదరాబాద్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, నిర్మల్‌కు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను, ఖానాపూర్‌కు సీనియర్ నేత అబ్దుల్ ముజీబ్‌ను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు వరకు క్షేత్రస్థాయిలో వీరు పార్టీని సమన్వయం చేయనున్నారు. నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఈ నియామకాలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
News January 25, 2026
ప్రకాశం: వీటి విషయంలో జాగ్రత్త.!

ఏ ఉత్సవానికైనా పటాకుల పేలుళ్లు కచ్చితంగా మారాయి. అయితే వాటి విషయంలో కొంతమంది వహిస్తున్న నిర్లక్ష్యంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల కడపలో జరిగిన శోభాయాత్రలో సెక్యూరిటీ గార్డ్ <<18946125>>హరి శంకర ప్రసాద్(52)<<>> పటాకులు తన శరీరంపై పేలడంతో చనిపోయారు. అయితే పటాకులు పేలుస్తున్న వారి నిర్లక్ష్యం వల్ల వాటికి దూరంగా ఉన్న హరి దగ్గరకు అవి వచ్చి పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే ‘సోదరా పటాకుతో జాగ్రత్త’గా ఉండండి.
News January 25, 2026
కడప: వీటితో జాగ్రత్త.!

ఏ ఉత్సవానికైనా పటాకుల పేలుళ్లు కచ్చితంగా మారాయి. అయితే వాటి విషయంలో కొంతమంది వహిస్తున్న నిర్లక్ష్యంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల జరిగిన శోభాయాత్రలో సెక్యూరిటీ గార్డ్ <<18946125>>హరి శంకర ప్రసాద్(52)<<>> పటాకులు తన శరీరంపై పేలడంతో చనిపోయారు. అయితే పటాకులు పేలుస్తున్న వారి నిర్లక్ష్యం వల్ల వాటికి దూరంగా ఉన్న హరి దగ్గరకు అవి వచ్చి పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే ‘సోదరా పటాకుతో జాగ్రత్త’గా ఉండండి.


