News December 2, 2025
HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్‌లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
Similar News
News February 18, 2026
కామారెడ్డి: ‘పీఎంశ్రీ నిధులు వెంటనే ఖర్చు చేయాలి’

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, పీఎంశ్రీ కింద మంజూరైన నిధులకు సంబంధించి, సివిల్ వర్క్స్ ఈనెల 23వ తేదీలోపు పాఠశాలల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
News February 18, 2026
సింగరేణి గనులను సందర్శించిన RTI కమిషనర్లు

పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, దేశాల భూపాల్, మొహసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్య రెడ్డి బుధవారం ఆర్జీ-1 ఏరియాలోని బొగ్గు గనులను సందర్శించారు. వీరికి జి.యం లలిత్ కుమార్ గని పనితీరు, బొగ్గు ఉత్పత్తి విధానాన్ని వివరించారు. అంతకుముందు కమిషనర్లు సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News February 18, 2026
ఖమ్మంలో సదరం శిబిరం ఏర్పాట్లపై ఆరా

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సదరం (SADAREM) బ్లాక్‌ను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. రాబోయే శిబిరం కోసం జరుగుతున్న సివిల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, శిబిరానికి వచ్చే దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.


