News February 9, 2025

HYDలో రవాణా వ్యవస్థ బలోపేతానికి HUMTA

image

HYD నుంచి ORR వరకు రవాణా వ్యవస్థ బలోపేతానికి HMDA పరిధి HUMTA (హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ) బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. HYD నగరంలో ప్రజా రవాణాపై క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు తీసుకుని, విశ్లేషించి, దానికి తగ్గట్లు ప్రణాళికలను రూపొందించి, ట్రాఫిక్ సమస్యను తగ్గించడం, అవసరమైన రవాణాను మెరుగుపరచడంపై ఇది ఫోకస్ పెడుతుంది.

Similar News

News March 21, 2025

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

image

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు మూవీ యూనిట్ పేర్కొంది. సాటిలేని హీరోయిజం ప్రయాణం వెండి తెరకు మరింత చేరువైనట్లు పేర్కొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా మిగతా భాగాన్ని తెరకెక్కించే బాధ్యత జ్యోతి కృష్ణ తీసుకున్నారు. కాగా ఈ మూవీ మే 9న థియేటర్లలో విడుదల కానుంది.

News March 21, 2025

పరీక్షా కేంద్రాలను సందర్శించిన DEO

image

జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలను సందర్శించారు. అనంతరం విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరీక్ష కేంద్రాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

News March 21, 2025

GWL: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

image

గద్వాల పట్టణంలోని MALD ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో జాబ్ మేళాకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. జాబ్ మేళాలో ఉద్యోగం సంపాదించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు.

error: Content is protected !!