News March 28, 2024
HYDలో రాముడి శోభాయాత్రకు భారీ ప్లాన్..!

శ్రీ రామనవమికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. 20 రోజుల ముందే ఆయా ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ధూల్‌పేటలో నిర్వహించే రాముడి శోభాయాత్రకు తరలిరావాలని రాజాసింగ్ పిలుపునిస్తున్నారు. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటలకు ఆకాశ్‌పురి హనుమాన్ టెంపుల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. యాత్రను విజయవంతం చేయాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Similar News
News February 7, 2026
HYD: ఆమోదాలు.. ఖజానా ఖాళీ చేసేందుకేనా?

GHMC పాలకమండలి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెల 10న పదవీకాలం ముగియనుండగా.. 9న స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. కొన్ని టేబుల్ అజెండాలను ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఒక్కరోజు ముందు ఆమోదించి ఏం అభివృద్ధి చేస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ లోలోపల మాత్రం టెండర్ల బిల్లులు చెల్లింపు పేరుతో ఖజానా ఖాళీ చేయడానికి కమిటీ సమావేశం అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
News February 7, 2026
హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ @278

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శనివారం తెల్లవారుజామున గాజులరామారంలో 278గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News February 7, 2026
HYD: అవినీతికి నిలయంగా GHMC ‘ఇంజినీరింగ్’ విభాగం..?

GHMCలో అత్యధిక అవినీతి విభాగంగా ఇంజినీర్ విభాగం మారింది. ఓవైపు ఏసీబీ దాడులు జరుగుతున్న.. వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఒక్కో టెండర్‌కు ఒక్కో నిబంధనలో పెడుతూ కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కొందరు లంచాలకు కక్కుర్తి పడి అనుమతులు ఇస్తున్నారు. వీటికి ఇప్పటివరకు జరిగిన ఏసీబీ దాడులే నిదర్శనం.


