News August 22, 2025
HYDలో ‘Go Back’ స్లోగన్స్.. మీ కామెంట్?

HYD వేదికగా ‘మార్వాడీ గో బ్యాక్’ స్లోగన్స్ చేస్తూ.. నేడు TG బంద్‌కు OU JAC పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. మరో ఉద్యమం మొదలైందంటూ SMలో పోస్టులు పెడుతున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదానికి INC, BJP దూరంగా ఉన్నాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా సిటీలో మార్వాడీలు స్థిరపడ్డారని, కలిసి మెలిసి ఉంటున్న సమయంలో కొత్తగా ఆందోళన ఏంటని కొందరు పెదవి విరిస్తున్నారు. మరి ‘గో బ్యాక్’ నినాదంపై మీ కామెంట్?
Similar News
News January 23, 2026
HYD: టీచర్‌పై లైంగిక దాడికి యత్నం

టీచర్ ఉద్యోగం కోసం పిలిచి లైంగిక దాడికి యత్నించిన స్కూల్ కరస్పాండెంట్‌పై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫతేనగర్‌లోని ఓ పాఠశాలలో ఉద్యోగం కోసం ఓ టీచర్ ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూ చేసిన సదరు కరస్పాండెంట్ జాబ్ ఇచ్చాడు. ఆమెతో చనువుగా మాట్లాడుతూ లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ఈ విషయంపై PSలో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News January 23, 2026
HYD: CNG కావాలంటే క్యూ కట్టాల్సిందే!

వారం రోజులుగా సిటీలో CNG గ్యాస్ దొరకడం లేదని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్దనున్న పెట్రోల్ బంక్‌లో గత 3-4 గంటల నుంచి క్యూ కట్టారు. ఇతర బంకుల్లోనూ CNG కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. CNG నింపుకోవడానికి దినం గడిచిపోతుందని.. బిజినెస్ ఎప్పుడు చేసుకోవాలని వాపోతున్నారు. సమస్య తీర్చాలంటున్నారు.
News January 23, 2026
చర్లపల్లి నుంచి కేరళకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

HYD ప్రయాణికులకు గుడ్‌న్యూస్. చర్లపల్లి నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు సరికొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. కేరళలో ప్రధాని మోదీ ఈ రైలుకు పచ్చజెండా ఊపారు. తక్కువ ఛార్జీతోనే విమానం రేంజ్ సౌకర్యాలు, కుదుపులు లేని ప్రయాణం సామాన్యుడికి సొంతం కానుంది. ప్రతి మంగళవారం చర్లపల్లిలో 7.15 AMకి, ప్రతి గురువారం 11.30 PMకి తిరువనంతపురంలో స్టార్ట్ అవుతుంది.
SHARE IT


