News February 15, 2025

HYD: అలా కనిపిస్తే ఫిర్యాదు చేయండి: డిజీ

image

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్రమంగా మెడిసిన్ నిల్వలు, తయారీ, విక్రయాలు జరిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని DCA డీకే కమలాసన్ రెడ్డి సూచించారు. 18005996969కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం అందినా తమకు తెలియజేయాలని సూచించారు.

Similar News

News March 15, 2025

గ్రూప్ 2, 3 ఫలితాల్లో మంచిర్యాల యువకుడి సత్తా

image

గ్రూప్ 2,3 ఫలితాల్లో మంచిర్యాల ఆర్ఆర్ నగర్‌కు చెందిన మండల సుమంత్ గౌడ్ సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన గ్రూప్ 3 ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. కాగా గతంలో విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో 172 ర్యాంకు సాధించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన్ను పలువురు అభినందించారు.

News March 15, 2025

VZM: ఈనెల 16న FRO ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌

image

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్స్ ఉద్యోగాల భ‌ర్తీకి ఈ నెల 16న జ‌రిగే రాత‌ప‌రీక్ష‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి ఆదేశించారు. పట్టణంలోని త‌మ ఛాంబ‌ర్లో శ‌నివారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30 నుంచి 12 గంట‌లు వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5 గంట‌లు వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని చెప్పారు. రెండు ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశామన్నారు.

News March 15, 2025

‘ఫోటో ఓటర్ జాబితా తయారీకి ప్రతి ఒక్కరు సహకరించాలి’

image

పారదర్శక, స్వచ్ఛమైన ఫోటో ఓటరూ జాబితా తయారీలో భాగంగా నిరంతర మార్పులు, చేర్పుల విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికిసహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరూ జాబితా తయారీలో ఎప్పటికప్పుడు వస్తున్నమార్పులు, చేర్పులు, తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నల్గొండ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!