News February 10, 2025
HYD: అలా చేస్తే.. మీ భరతం పడతాం: హైడ్రా

HYD నగరం సహా, ORR వరకు అనుమతులు లేకుండా రోడ్లపై, రోడ్లకు ఇరుపక్కలా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే మీ భరతం పడతామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల శంషాబాద్‌లో భారీ హోర్డింగ్ తొలగించినట్లు ఉదహరించింది. ఎక్కడైనా ప్రమాదకరమైన హోర్డింగులు ఉంటే తమ దృష్టికి తేవాలని హైడ్రా కోరింది. ఎక్కడికక్కడ కఠిన చర్యలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.
Similar News
News February 11, 2026
HYD: వాటర్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వీరే!

నగరంలో నాన్ క్యాడర్ అధికారుల బదిలీలు జరిగాయి. మల్కాజిగిరి HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ బదిలీ అయ్యారు. హైదరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సామ్రాట్ అశోక్ నామ బదిలీ కాగా, సైబరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎం.సంతోష్ బదిలీ అయ్యారు. లోక్ భవన్ జాయింట్ సెక్రటరీగా కె.శశికిరణచారి బదిలీ అయ్యారు. సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
News February 11, 2026
పురపోరుకు రంగారెడ్డి జిల్లా సిద్ధం

రంగారెడ్డి జిల్లాలో పుర పోరుకు సిద్ధమైంది. ఉ.7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై.. సా.5 గంటల వరకు కొనసాగనుంది. జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 437 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 126 మంది, బీఆర్ఎస్ నుంచి 122, బీజేపీ నుంచి 109 మందితో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 57 మంది ఉన్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్ క్యారీ చేయండి.
News February 10, 2026
రేపే మున్సిపల్ ఎన్నికలు.. సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 126 వార్డుల్లో 437 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,76,023మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే సామగ్రిని మంగళవారం కేంద్రాలకు ఆయా తరలించారు.


