News February 10, 2025

HYD: అలా చేస్తే.. మీ భరతం పడతాం: హైడ్రా

image

HYD నగరం సహా, ORR వరకు అనుమతులు లేకుండా రోడ్లపై, రోడ్లకు ఇరుపక్కలా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే మీ భరతం పడతామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల శంషాబాద్‌లో భారీ హోర్డింగ్ తొలగించినట్లు ఉదహరించింది. ఎక్కడైనా ప్రమాదకరమైన హోర్డింగులు ఉంటే తమ దృష్టికి తేవాలని హైడ్రా కోరింది. ఎక్కడికక్కడ కఠిన చర్యలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.

Similar News

News February 13, 2026

1,782 మంది సిబ్బందితో బందోబస్తు: నంద్యాల ఎస్పీ

image

శ్రీశైలం క్షేత్రంలో 1,782 మంది సిబ్బందితో బ్రహ్మోత్సవాల ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. నంద్యాలలో ఏఎస్పీ, డీఎస్పీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏఎస్పీలు 11 మంది, డీఎస్పీలు 24, సీఐలు 78, ఎస్సైలు 132, ఏఎస్ఐ-హెచ్‌సీలు 303, పీసీలు 568, ఉమెన్ పీసీలు 88, హోంగార్డులు 386, ఉమెన్ హోంగార్డ్స్ 30 మందితో పాటు ఏఆర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

News February 13, 2026

పెద్దపల్లి జిల్లాలో పార్టీల వారీగా విజేతల వివరాలు..!

image

పెద్దపల్లి జిల్లాలో 124 వార్డు స్థానాలు ఉండగా రామగుండం కార్పొరేషన్ లో ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 123 వార్డులకు జరిగిన ఎన్నికలలో పార్టీల వారీగా బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ – 89, BRS – 16, BJP- 3, AIFB- 13, CPI- 1, స్వతంత్ర అభ్యర్థులు- 2 స్థానాలలో విజయం సాధించారు.

News February 13, 2026

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ముందంజ

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.