News August 13, 2025

HYD: ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏంటి..?

image

ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏంటో తెలుసా..? బడికి వెళ్లే వయసులో పరిశ్రమల్లో కార్మికులుగా మారిన వారిని గుర్తించడమే ఈ ఆపరేషన్ ముస్కాన్. పలు చోట్ల యాచకులుగా, కార్మికులుగా రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో కాలం వెల్లదీస్తున్న వారిని, చిన్నారులను గుర్తించి, ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో ద్వారా చేరదీస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ జులైలోనే 3,853 మందిని రక్షించినట్లుగా పోలీసులు తెలిపారు.

Similar News

News March 13, 2026

వనపర్తి: ‘సాగు, తాగునీటికి ఇబ్బంది కలగనివ్వద్దు’

image

వనపర్తి జిల్లాలో సాగు, తాగునీటితో పాటు విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికి వచ్చే వరకు రైతులకు ఇబ్బంది కలగనివ్వద్దన్నారు. అలాగే జిల్లాలో LPG సిలిండర్ల కొరత లేదని, ఆసుపత్రులు, పాఠశాలలకు నిరంతరం సరఫరా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

News March 13, 2026

సీఎం ను కదిలించిన ఏలూరు కలెక్టర్

image

పాపికొండల అభయారణ్య పరిధిలోని గిరిజన గ్రామాల్లో బోరుబావులు, రహదారుల నిర్మాణానికి అటవీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ వెట్రిసెల్వి సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. స్పందించిన సీఎం గిరిజనులకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అటవీ అధికారులు కొంత వెసులుబాటు ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో గిరిజనులకు మౌలిక సదుపాయాలు అందేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.

News March 13, 2026

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత.. JC క్లారిటీ

image

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గృహ వినియోగానికి సరిపడా LPG సిలిండర్లు నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చారు.