News August 22, 2025
HYD: ఆ కంపెనీలను ORR బయటకు పంపుడే..!

HYD నగరంలో పలు చోట్ల రెడ్ కేటగిరి కంపెనీలు కాలుష్య భూతంగా మారుతున్నాయని అధికారులు గుర్తించారు. కాటేదాన్ IDA, బొల్లారం, జీడిమెట్ల లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కంపెనీలను అవుటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించాలనీ, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Similar News
News January 24, 2026
KNR: ఒకే రోజు, ఒకే సమయంలో రెండు పరీక్షలు

శాతవాహన యూనివర్సిటీలో PG మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇవి ఈ నెల 29తో ముగియనున్నాయి. అలాగే, ఈ నెల 27 నుంచి అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 2 యూనివర్సిటీల పరీక్షల సమయం, తేదీ ఒకే విధంగా ఉండటంతో రెగ్యులర్‌గా PG చదువుతున్న విద్యార్థులు, ఓపెన్ యూనివర్సిటీలో MA చేస్తున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు.
News January 24, 2026
HYD: కబ్జా జరిగిందా.. 9000113667కు కాల్ చేయండి

హైదరాబాద్ నుంచి ORR వరకు చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, లేఅవుట్ ఆక్రమణలు, పార్కుల కబ్జాలు ఉంటే వెంటనే హైడ్రాకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. హైడ్రా హెల్ప్‌లైన్ 040-29565758కు కాల్ చేసి తెలియజేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో (DRF) 9000113667కు నంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
News January 24, 2026
పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగుతో లాభాలు

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.


