News May 23, 2024

HYD: ఆ తల్లి ఆరుగురికి జీవం పోసింది..!

image

HYDలో ఓ తల్లి మరణించినా.. అవయవ దానం ద్వారా ఆరుగురికి ప్రాణం పోశారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలానికి చెందిన జంపాల సుజాత అపస్మారక స్థితిలో ఇటీవల కింద పడిపోయారు. వెంటనే ఆమెను HYD మేడిపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా, తాజాగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల అంగీకారంతో సుజాత గుండె, నేత్రాలు, కాలేయం తీసుకుని ఆరుగురికి అమర్చి, ప్రాణం పోసినట్లు జీవన్ దాన్ బృందం తెలిపింది.

Similar News

News March 7, 2026

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

image

TPCC మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామితలయ్యారు. అధ్యక్షురాలిగా పార్టీ చీఫ్ ఖర్గే ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమె కాంగ్రెస్‌లో 45 ఏళ్లుగా ఉన్నారు. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికవ్వగా 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023-25 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.

News March 7, 2026

HYD: మేడం సార్.. మేడం అంతే!

image

షాద్‌నగర్‌కి చెందిన ఇంద్రార్చిత కర్ణాటక క్యాడర్‌లో సివిల్స్‌లో 627వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. ఆమె ప్రాథమికోన్నత విద్య షాద్‌నగర్‌లో పూర్తిచేశారు. HYDలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి.. ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకొని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ‘మేడం’ గ్రేట్ అనిపించుకున్నారు.

News March 7, 2026

VFX హబ్‌గా HYD.. ప్రారంభించనున్న సీఎం

image

ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ తన కార్యాలయాన్ని హైదరాబాదHలో ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు దీనిని ప్రారంభించనున్నారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ స్టూడియోను ప్రారంభించనుంది. భారతదేశంలో తనకు రెండో కార్యాలయం కానుంది. దీని ద్వారా VFX, గేమింగ్ కామిక్స్ రంగంతో పాటు వివిధ రంగాలలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని చెబుతున్నారు.