News November 20, 2025

HYD: ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేయాలి: మంత్రి

image

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెర్ప్ ఉన్నతాధికారులతో గురువారం HYD నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీతక్క అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో నిర్వహించాలని, ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలన్నారు.

Similar News

News January 20, 2026

ఎల్బీనగర్ మెట్రోలో GOOD ‘మెసేజ్’

image

ఎప్పుడూ బిజీగా ఉండే మెట్రోలో మంగళవారం ఓ వింత దృశ్యం కనిపించింది. ఎల్బీనగర్ వెళ్లే రైలులో ఎవరో ఒక ‘జెన్-జీ’ కుర్రాడో, అమ్మాయో అతికించిన గ్రీన్ స్టిక్కీ నోట్స్ ప్రయాణికుల మనసు గెలుచుకుంటున్నాయి. “ప్రతిఫలం ఆశించకుండా సాయం చెయ్.. నీ మనసు చెప్పిందే విను” అంటూ డయానా చెప్పిన మంచి మాటలను ఆ నోట్స్‌పై రాశారు. యాంత్రికమైన ఈ కాలంలో నలుగురికి మంచిని పంచాలనే ఈ చిన్న ప్రయత్నం ప్రయాణికుల్లో నవ్వులు పూయించింది.

News January 20, 2026

HYD శివారులో సంజీవని!

image

నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నేల కలుషితమవుతున్న వేళ ‘మైకోరైజా’ అనే మేలు చేసే శిలీంధ్రాలు రైతులకు వరంగా మారనున్నాయి. ఈ ప్రత్యేక శిలీంధ్రాలు భూమిలోని పోషకాలను వేర్లకు అందించి, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. హైదరాబాద్ కేంద్రంగా వీటి ఉత్పత్తి పెరగడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యకరమైన పంటలు పండించే అవకాశం లభిస్తుంది. దీంతో పర్యావరణాన్ని కాపాడుకుంటూ విషం లేని ఆహారాన్ని అందించనుంది.

News January 20, 2026

ఖైరతాబాద్ మైనారిటీ గురుకులాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

image

స్థానిక మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ హబీబ్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, యూనిఫాం, పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. అర్హులైన మైనారిటీ విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి సీట్లు రిజర్వు చేసుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకు 9182628275 నంబరును సంప్రదించాలని కోరారు.