News August 24, 2024
HYD: ఇక 40 ఏళ్ల వరకు డోకా లేదు: కేంద్ర మంత్రి

HYD నగరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిపై రైల్వే సహాయక మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు మీడియాతో మాట్లాడారు. పునరాభివృద్ధి అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే, 40 ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదన్నారు. రాబోయే 40 ఏళ్ల ప్రయాణికుల సామర్థ్యాన్ని అంచనా వేసి, డిజైన్ చేసి పనులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో GM అరుణ్ కుమార్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News January 18, 2026
FLASH.. HYD: భార్యను కత్తితో పొడిచిన భర్త

మానవ సంబంధాలు దారి తప్పుతున్నాయి. HYD శివారు, దుండిగల్ PS పరిధి డి.పోచంపల్లిలో డాక్టర్ బస్తీలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మద్యానికి బానిసైన భర్త సాదుల్లా, భార్య సాహిని(30)ని తాగడానికి డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 18, 2026
HYDలో ఫిబ్రవరి 10 డెడ్‌లైన్

మేయర్, పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026తో ముగియనుంది. అప్పటివరకు విలీన మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల కింద ఉండనుండగా ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. మార్చి నాటికి డివిజన్ల వారీ ఫైనల్ రిజర్వేషన్ గెజిట్ విడుదల చేసి, ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ఇప్పటికే జలమండలి, రెవెన్యూ విభాగాలను దీనికి <<18882564>>అనుగుణంగా<<>> సిద్ధం చేస్తోంది.
News January 18, 2026
విభజన బ్లూప్రింట్: పోలీస్ కమిషనరేట్లే ప్రామాణికం?

మెగా బల్దియాను 3 కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి) విభజించే ప్రతిపాదనపై ప్రభుత్వం రహస్యంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణనే దీనికి ప్రామాణికంగా తీసుకోనున్నారు. పోలీస్ సరిహద్దుల ప్రకారమే కొత్త కార్పొరేషన్ల పరిధి ఉంటే పాలనాపరమైన ఇబ్బందులు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. <<18882495>>300 డివిజన్ల<<>> డేటా అందుబాటులో ఉండటంతో రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకం కలగదు.


