News December 1, 2025

HYD: ఇష్టారీతిగా ప్రైవేట్ స్కూల్ ఫీజులు వసూళ్లు!

image

నగరంలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమ జేబులు ఖాళీ చేయడంమే లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ట్యూషన్, స్పెషల్ ఫీజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేపటకపోవడంతో, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. దీనిపై సహించేది లేక విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు యోచిస్తున్నారు.

Similar News

News February 13, 2026

పిల్లలకు పాలు అరగాలంటే..!

image

పసిపిల్లలు పాలు తాగిన తర్వాత కచ్చితంగా బర్పింగ్ చేయించాలి. లేదంటే వారు తాగిన పాలను వాంతి చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. పిల్లలను బర్పింగ్ చేయించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని సున్నితంగా భుజంపై పెట్టుకొని నెమ్మదిగా వీపును సవరదియ్యాలి. లేదంటే బేబీని ఒళ్లో కూర్చోబెట్టుకొని కాస్త ముందుకు వంచి వీపును సవరదియ్యాలి. ఇలా త్రేన్పులు వచ్చే వరకు చెయ్యాలని చెబుతున్నారు.

News February 13, 2026

తారిఖ్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా: మోదీ

image

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో <<19125261>>ఘన విజయం<<>> సాధించిన BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్‌‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ గెలుపు బంగ్లా ప్రజలకు మీ నాయకత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. డెమొక్రటిక్, ప్రోగ్రెసివ్ బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతుగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య బంధాలు బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News February 13, 2026

రంగారెడ్డి జిల్లాలో 2చోట్ల బోణీ కొట్టిన BRS

image

రంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో BRS బోణీ కొట్టింది. ఇబ్రహీంపట్నంలోని 24 వార్డులకు సంబంధించిన ఫలితాల్లో 11వ వార్డు BRS అభ్యర్థి శ్రీలత రాంబాబు 484 ఓట్లతో, 12వ వార్డు కొండిగారి త్రిలోక్ 316 ఓట్లతో విజయం సాధించారు. త్రిలోక్ మాజీ MLA కొండిగారి రాములు కుమారుడు. ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు STAY TUNED TO Way2News.