News August 13, 2025
HYD: ఇస్రో ఛైర్మన్‌కు డాక్టరేట్: VC కుమార్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించింది. ఈనెల 19న జరగనున్న ఓయూ 84వ స్నాతకోత్సవంలో ఓయూ కులపతి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ (డాక్టరేట్ ఆఫ్ సైన్స్) అందించనున్నట్లు ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం తెలిపారు. ఇస్రో ఛైర్మన్‌కు డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News March 7, 2026
ఊర్కొండ: సర్పంచ్ భర్తపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు

ఊర్కొండ సర్పంచ్ భర్త మేకల శ్రీనివాసులు కాంగ్రెస్ నాయకులను, ఎస్సీ వర్గానికి చెందిన వారిని దుర్భాషలాడిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం ఆయనపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుపై కల్వకుర్తి డీఎస్పీ దర్యాప్తు చేయనున్నారని ఎస్సై కృష్ణదేవ తెలిపారు.
News March 7, 2026
నేపాల్ రాజకీయాలను మలుపుతిప్పిన ‘స్టార్లు’

ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ జోరుతో నేపాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీని వెనుక ఇద్దరు ‘స్టార్లు’ ఉన్నారు. ఒకరు TV ప్రెజెంటర్, RSP ఫౌండర్ రబి లామిచానే కాగా మరొకరు ర్యాపర్ బాలెన్ షా. 2022లో RSP స్థాపించిన రబి, రాజకీయ చతురతతో తక్కువకాలంలో Dy.PM హోదాకు చేరారు. ఇక ర్యాపర్ బాలెన్ షా యువతలో ఆదరణ సంపాదించారు. 2025లో షా RSPలో చేరి రబితో చేతులు కలపడంతో అక్కడి పాలిటిక్స్ మలుపు తిరిగాయి.
News March 7, 2026
సిరిసిల్ల: ‘ప్రజా పాలన’తో గ్రామాల్లో మార్పు: కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించి సమూల మార్పు తీసుకువస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని కలెక్టర్ స్పష్టం చేశారు.


