News November 19, 2025

HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News January 22, 2026

ADB: పురు పోరు.. కమిషనర్‌ల బదిలీలు

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. బుధవారం 47 మంది అధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు ఏడుగురు కమిషనర్లు బదిలీ అయ్యారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.

News January 22, 2026

గెలుపు బాధ్యత పార్టీ MLAలు, ఇన్‌ఛార్జులకు అప్పగింత

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు పూర్తి బాధ్యతను పార్టీ MLAలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు BRS అప్పగించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీకి సమర్థులైన అభ్యర్థుల ఎంపిక బాధ్యతను వీరికే వదిలిపెట్టింది. ప్రచార అజెండా నిర్ణయంతో సహా పోల్ మేనేజ్మెంటు అంశాలనూ వీరే నిర్ణయించాలని నిర్దేశించింది. ఛైర్మన్, మేయర్ ఇతర పదవులకు ఎంపిక బాధ్యతనూ MLAలు, ఇన్‌ఛార్జులకే ఇచ్చింది.

News January 22, 2026

నిర్మల్: పుర పోరు.. సీఎం స్పెషల్ ఫోకస్

image

నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతాల్లో BJPని నిలువరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. నిర్మల్ సభ వేదికగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగించి కేడర్‌లో ఉత్సాహం నింపారు.