News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 12, 2026
మేడారం: ఎల్లుండి మహా జాతర ఘట్టం ప్రారంభం

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రారంభ ఘట్టం ఎల్లుండి (బుధవారం) పూజారులు ప్రారంభించనున్నారు. జాతర ప్రారంభానికి ముందు పూజారులు శుద్ధి పండుగ (మండెమెలిగే) పండగను నిర్వహించడంతో మహా జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. బుధవారం అడవికి వెళ్లి గుట్ట గడ్డిని సేకరించుకొని మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకొని, గుడిపైన గడ్డిని వేసి సమ్మక్క గద్దెను శుద్ధిచేసి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
News January 12, 2026
HYD: రూ.60కే సంక్రాంతి సంబరాలు

HYD హైటెక్ సిటీ నడిబొడ్డున పల్లెటూరి పండగ సందడి మొదలైంది. మాదాపూర్ సాఫ్ట్‌వేర్ కుర్రాళ్ల నుంచి ఆటో అన్నల దాకా అందరినీ అలరించేందుకు శిల్పారామం సంక్రాంతి సంబరాలు (జనవరి 13-17) సిద్ధమయ్యాయి. నల్గొండ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పుట్టపాక చేనేత సిరులతో 65 ఎకరాల ప్రాంగణం అలరిస్తోంది. టికెట్ కేవలం రూ.60 మాత్రమే. ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు మన ఊరి పండగను ఇక్కడే చూసేయండి!