News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 12, 2026
ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

WPL-2026లో ఆర్సీబీ ముందు యూపీ వారియర్స్ 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. RCB బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీ ఓపెనర్లు లానింగ్(14), హర్లీన్(11) పరుగులు రాబట్టేందుకు తడబడ్డారు. లిచ్‌ఫీల్డ్(20), కిరణ్(5) విఫలమవ్వగా ఆల్‌రౌండర్లు దీప్తి(45*), డాటిన్(40*) ఆరో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో UP 20 ఓవర్లలో 143/5 స్కోరు చేసింది. RCB బౌలర్లలో నాడిన్, శ్రేయాంక చెరో 2, లారెన్ ఒక వికెట్ తీశారు.
News January 12, 2026
కనీసం 7 గంటలు నిద్రపోవట్లేదా.. మీ ఆయుష్షు తగ్గినట్లే!

నిద్ర సరిగా లేకపోతే సాధారణ అనారోగ్య సమస్యలే కాకుండా ఏకంగా ఆయుష్షే తగ్గిపోతుందని Oregon Health Science University స్టడీలో తేలింది. ఆయుర్దాయంపై ప్రభావం చూపే జీవనశైలి అలవాట్లను పరిశీలించగా.. స్మోకింగ్ తర్వాత నిద్రే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నవారి ఆయుష్షు తగ్గుతున్నట్లు గమనించారు. డైట్, వ్యాయామం కంటే కూడా నిద్రే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు తేల్చారు.
News January 12, 2026
HZB: అలిశెట్టి ప్రభాకర్ ‘యాది’లో..

ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్‌లో ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జనసాహితి సభ్యుడు విప్లవ్ దత్ శుక్లా 1991లో జరిగిన ఓ నాటి సమావేశ అరుదైన చిత్రపటాన్ని పంచుకున్నారు. అప్పట్లో జనసాహితి ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్తు హాలులో నిర్వహించిన మహాకవి శ్రీశ్రీ జయంతి సభకు అలిశెట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.


