News August 23, 2025

HYD: ఈ రూట్‌లో మారథాన్.. ఆల్టర్నేట్ రోడ్లలో వెళ్లండి..!

image

‘HYD మారథాన్’ ఆదివారం ఉ.5 గంటల నుంచి ఉ.11:30 వరకు ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ఈరోజు తెలిపారు. 42K / 21K ఈవెంట్ పీపుల్‌ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు,10K రన్ ఈవెంట్ హైటెక్ గ్రౌండ్స్, మాదాపూర్, క్యుములేషన్ గచ్చిబౌలి స్టేడియం రూట్లలో జరుగుతాయన్నారు. పలు రోడ్లు మూసి ఉంటాయని ORR, రోలింగ్ హిల్స్, IKEA ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ వంతెన, మాదాపూర్ రోడ్డు ఆల్టర్నేట్ రూట్లని తెలిపారు.

Similar News

News January 24, 2026

నరసరావుపేటలో ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం

image

ఆడబిడ్డలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆకాంక్షించారు. శనివారం కలెక్టరేట్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. బాలికల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి రక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

News January 24, 2026

ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోడౌన్‌ను పరిశీలించిన ఏలూరు కలెక్టర్

image

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోడౌన్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. భద్రత సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు గోడౌను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News January 24, 2026

నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్.. 16 అర్జీల స్వీకరణ

image

పల్నాడు కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశాల మేరకు నిర్వహించిన ‘ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు విశేష స్పందన లభించింది. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై మెుత్తం 16 అర్జీలను సమర్పించారు. వీటిపై జేసీ సంజన సింహా స్పందించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తూ, గడువులోగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.