News April 11, 2025
HYD: ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలి: MDUV

మూడు దశాబ్దాల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటంలో ఉద్యమకారులపై నమోదైన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని మాదిగ దండోర ఉద్యమకారుల వేదిక (ఎండీయూవీ) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఇవ్వడంతోపాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలాన్నారు.
Similar News
News January 20, 2026
KNR: ‘పే స్కేల్ బకాయిలను వెంటనే చెల్లించాలి’

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. 2017 పే స్కేల్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఎస్ఆర్‌బీఎస్ లైఫ్ సర్టిఫికెట్‌ను వెంటనే ఆన్ లైన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
News January 20, 2026
మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.
News January 20, 2026
₹15 లక్షల భరణం అడిగిన భార్య.. భర్త ఏం చేశాడంటే..

భార్య ₹15 లక్షల భరణం అడిగిందని ఉద్యోగానికి రిజైన్ చేశాడో భర్త. కెనడాకు చెందిన దంపతులు సింగపూర్‌లో ఉంటున్నారు. 2023లో అతడు భార్యతో విడిపోయాడు. తనకు, పిల్లల(4)కు కలిపి నెలకు S$20వేలు(₹15L) భరణం ఇవ్వాలని ఆమె అడగడంతో జాబ్ మానేశాడు. 2023లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా అతడి వార్షిక జీతం S$8.6 లక్షలు(₹6Cr). ఈ క్రమంలో ఆమెకు S$6.34 లక్షలు(₹4.47Cr) చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది.


