News August 23, 2025

HYD: ఉర్దూ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్

image

HYD మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిర్వహించే కోర్సుల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 17 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. 2025- 26 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ లర్నింగ్ అండర్ UG, PG, డిప్లమా సర్టిఫికెట్ కోర్సులకు కూడా అడ్మిషన్లు అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.

Similar News

News January 15, 2026

HYDలో 3 రోజులు.. సాయంత్రం అలా!

image

పరేడ్ గ్రౌండ్లో కైట్& స్వీట్ ఫెస్టివల్ నేడు ఆఖరిరోజు. నిరాశ చెందకండి రేపటి నుంచి అసలు మజా ఇక్కడే హాట్ ఎయిర్ బెలూన్ షోతో ఉంటుంది. చల్లని సాయంత్రం, చిన్న ఫైర్‌తో రంగుల బెలూన్‌లు ఆకాశంలో ఎగురుతుంటే ఫ్యామిలీ, దోస్తులతో వాటిని చూస్తూ చిల్ అవ్వడం కంటే ఏంకావాలి. ఆకాశంలో ఎగిరే ఈ బెలూన్లు నగరవాసులతో సహా పొరుగు రాష్ట్రాల వారికి మరపురాని అనుభూతిని అందించనున్నాయి. నేడు కైట్ ఫెస్టివల్‌కు భారీగా తరలిరానున్నారు.

News January 15, 2026

సంక్రాంతి వేళ HYDలో DANGER

image

HYDలో ఎయిర్ క్వాలిటీ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున గాజులరామారంలో 239కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. 2, 3 రోజులుగా వాయు నాణ్యత తగ్గుతూ.. ఇవాళ ప్రమాదకర స్థాయికి చేరింది.

News January 15, 2026

దావోస్‌లో CM ‘పవర్’ ఫుల్ ప్లాన్ ఇదే!

image

వర్షం పడితే చాలు కరెంటు పోతుందా? ఫ్యూచర్ సిటీలో గాలి వాన వచ్చినా సరే ఒక్క రెప్పపాటు కాలం కూడా కరెంటు పోని ‘అన్‌ఇంటరప్టెడ్’ ప్లాన్ ఉంది. CM దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికపై ఆవిష్కరించబోయే అత్యంత కీలకమైన అంశం ఈ “స్మార్ట్ మైక్రో-గ్రిడ్స్”. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. మెయిన్ పవర్ లైన్ తెగిపోయినా సెకనులో ఈ మైక్రో-గ్రిడ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల జనరేటర్ల అవసరం ఉండదు.