News August 11, 2025
HYD: ఎదుగుదలను చూసి ఓర్వలేక చంపేశారు!

మియాపూర్ PS పరిధిలో శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడనే అసూయతో వనపర్తికి చెందిన శ్రీనును సోహెల్ మరో ముగ్గురితో కలిసి కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని నిందితుల్లో ఒకరు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి, పరారయ్యాడు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. ఎదుగుదలను చూసి ఓర్వలేక చంపేయడం ఏంటని కుటుంబీకులు కన్నీరు పెట్టుకున్నారు.
Similar News
News March 16, 2026
బాలికల వసతి గృహంలో ఆగంతకుడు కలకలం

చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహంలోకి రాత్రివేళ ఓ ఆగంతకుడు గోడదూకి ప్రవేశించడం కలకలం రేపింది. విద్యార్థినులు భయంతో కేకలు వేయడంతో సదరు వ్యక్తి పరారయ్యాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు నిర్వాహకులు ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అధికారులను నిలదీశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై మండిపడ్డారు. భద్రతా వైఫల్యంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
News March 16, 2026
పద్మనాభంలో భారీగా కోడిపందాలు.. 73 మంది పట్టివేత

పద్మనాభ మండలం శివారు ప్రాంతం రాయల్ గార్డెన్స్‌లో అర్ధరాత్రి కోడిపందాలు నిర్వహిస్తుండగా సిటీ టాస్క్‌ఫోర్స్ పద్మనాభం పోలీసులు పట్టుకున్నారు. కోడిపందాలు నిర్వహణ ప్రాంతంలో 73 మందిని అదుపులోకి తీసుకోగా 7,56,000 నగదు, ఎనిమిది కారులు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. భారీ ఎత్తున కోడిపందాలు నిర్వహించడం స్థానికంగా సంచలమైంది.
News March 16, 2026
ప్రేయసికి భర్తను ‘లీజు’కు ఇస్తానన్న భార్య.. కానీ!

మోసం చేసిన భర్తకు విడాకులు ఇవ్వకుండా అతనిని ప్రేయసికే అద్దెకు ఇవ్వడానికి సిద్ధమైందో భార్య. దీనిద్వారా ఖున్ క్వాంగ్ నెలకు ₹85వేలు డిమాండ్ చేసింది. ఈ ఘటన థాయిలాండ్‌లో జరిగింది. వీరికి వివాహమై 10 ఏళ్లయింది. గతేడాది ఓ మహిళతో భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుర్తించింది. దీనిపై ప్రశ్నించగా ఇరువురూ విడిచి ఉండలేమన్నారు. దీంతో ఆమె అద్దె ప్రతిపాదన పెట్టగా ప్రేయసి ఒప్పుకుంది. కానీ భర్త అంగీకరించలేదు.


