News September 12, 2025

HYD: ఎమ్మెల్యేల వివరణను బీఆర్ఎస్‌కు పంపిన స్పీకర్

image

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యే వివరణలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీకి పంపించారు. ‘తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. వారి సమాధానం మీకు పంపుతున్నాం. మీరు మీ అభ్యంతరం, అభిప్రాయం చెప్పాలి’ అని స్పీకర్ కోరారు. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. దీంతో ఈనెల 13లోగా స్పీకర్‌కు వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

Similar News

News December 9, 2025

ఘోరం: భార్య మగ పిల్లాడిని కనలేదని..

image

టెక్నాలజీ ఎంత పెరిగినా కొందరిలో మూఢనమ్మకాలు పోవట్లేదు. కర్ణాటక విజయపుర(D)లో భార్య ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని ఆమెకు శిరోముండనం చేసి వెంట్రుకలను శ్మశానంలో కాల్చేశాడో భర్త. బ్లేడుతో కట్ చేయడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. భార్యలో దెయ్యం ఉందని, అందుకే మగ పిల్లాడు పుట్టలేదని ఓ మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి భర్త డుండేశ్‌ను అరెస్టు చేశారు.

News December 9, 2025

NGKL: నేటితో ప్రచారానికి తెర..!

image

జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి నేడు సాయంత్రం 5 గంటలకు తెర పడనుంది. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు మద్యం, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి గెలవాలని చూస్తున్నారు. మొత్తం 151 గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News December 9, 2025

విదేశీ విద్యకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ చేయూత

image

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఖమ్మంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన IELTS ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీలత తెలిపారు. శిక్షణతో పాటు స్కాలర్‌షిప్‌ పొందేలా మార్గనిర్దేశం చేస్తామని చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.