News March 31, 2024
HYD: ఎయిర్‌పోర్టు ప్రవేశమార్గం వరకు ఏసీ బస్సులు

HYD నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఆర్టీసీ ఏసీ పుష్పక్ బస్సులు నేరుగా ఎయిర్‌పోర్ట్ ప్రవేశం మార్గం వరకు వెళ్లనున్నాయి. శనివారం నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. HYD నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడిచే 49 ఏసీ బస్సులు అరైవల్స్‌తో పాటు డిపార్చర్స్ వద్ద కూడా ఆగనున్నాయి.
Similar News
News February 13, 2026
HYD: BEWARE OF రొమాన్స్ స్కామ్స్.. జాగ్రత్త బ్రో!

వాలంటైన్స్ డే ఆఫర్లంటూ వచ్చే లింకులు నొక్కారో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. గతేడాది మన రాష్ట్రంలో రొమాన్స్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ద్వారా ఏకంగా ₹12.65 కోట్లు కొల్లగొట్టారు. గిఫ్టులు, ఫ్లవర్ డెలివరీల పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. గుర్తుతెలియని వ్యక్తులకు ఫొటోలు, ఓటీపీలు షేర్ చేయొద్దు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయండని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. బీ అలర్ట్ బాసూ!
News February 13, 2026
మూడు కార్పొరేషన్లు.. కో-ఆప్షన్ కొలువులో కొత్త లెక్క!

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ఇప్పుడు హాట్ టాపిక్. గతంలో ఐదుగురు సభ్యులకే పరిమితమైన ఈ కోటా ఇప్పుడు ఆరుగురికి పెరగడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. తమకు అవకాశం దక్కుతుందా అని ఆశావాహులు ఆరా తీస్తుండగా, పాత లెక్కలు మారి కొత్త వారి ఎంట్రీకి మార్గం సుగమమైంది. పెరిగిన సభ్యుల బలంతో పాలనలో వేగం పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
News February 13, 2026
HYD: రేపే TG EAPCET నోటిఫికేషన్..!

JNTU, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న TG EAPCET 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించి శనివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 19వ తేదీ ఉదయం 11:30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE IT.


