News August 13, 2025

HYD: ఎయిర్‌పోర్ట్‌లో మారిన క్యాబ్స్ పికప్ పాయింట్

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రయాణికుల సౌలభ్యం కోసం క్యాబ్ పికప్ పాయింట్‌ను మార్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ప్రయాణికుల వాకింగ్ దూరాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబ్ పికప్ పాయింట్ గతంలో C పార్కింగ్‌లో ఉండగా ప్రస్తుతం H పార్కింగ్‌కు మార్చారు. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News March 17, 2026

ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చారు: వైసీపీ

image

కూటమి ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చిందని వైసీపీ విమర్శించింది. నాడు వంద రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పి.. నేడు రాష్ట్రం మొత్తం గంజాయి అమ్మకాలు జోరుగా సాగిస్తోందని ధ్వజమెత్తింది. ప్రస్తుతం టీడీపీ నాయకులు, వారి కొడుకులు డ్రగ్స్ వ్యాపారంలో మునిగితేలుతున్నారని, ఏకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్‌తో దొరికిపోవడంతో టీడీపీ నాయకులు సిగ్గుతో కుమిలిపోతున్నారని పేర్కొంది.

News March 17, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,600
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,352
* వెండి 10 గ్రాముల ధర రూ.2,610.

News March 17, 2026

బాపట్ల రైతులకు JC సూచనలు

image

రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1,73,384.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 28తో మూసివేస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని 28 లోపు విక్రయించుకోవాలన్నారు.