News August 13, 2025

HYD: ఐటీ రిటర్న్ పేరిట నకిలీ లింక్‌లతో జాగ్రత్త సుమా..!

image

ఐటీ రిటర్న్ పేరిట నకిలీ లింక్‌లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు HYD సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. అలాంటివి ఏవైనా మీరు గుర్తించినట్లయితే వెంటనే 18001030025, 18004190025 నంబర్లకు కాల్ చేసి, హెల్ప్ లైన్ ద్వారా సమాచారం పొందే అవకాశం ఉందని తెలిపారు. ITR అక్షరాన్ని వారు పంపి, లింక్‌లో జోడించి, హెల్ప్ డెస్క్ అంటూ వెబ్‌సైట్స్ లాంటివి క్రియేట్ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.

Similar News

News March 14, 2026

గ్యాస్ బుకింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సరికొత్త సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వంటగ్యాస్ సరఫరాపై వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసగాళ్ల ఉచ్చులో పడవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త పద్ధతులతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.

News March 14, 2026

తూ.గో: గ్యాస్ వినియోగదారులకు కలెక్టర్ సూచనలు

image

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గ్యాస్ సరఫరా చేస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గృహ అవసరాల వినియోగం, అత్యవసర సేవల కోసం ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ పంపిణీదారులతో జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News March 14, 2026

1.71 కోట్ల ORS ప్యాకెట్లు సిద్ధం: సత్యకుమార్

image

AP: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ‘అవేర్ ప్లాట్‌ఫాం ద్వారా 4-5 రోజుల ముందుగానే ఉష్ణోగ్రతల అప్డేట్ ఇస్తాం. వడదెబ్బకు గురైతే తీసుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధులపై మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 1.71Cr ORS ప్యాకెట్లను ఆస్పత్రులకు పంపాం. గర్భిణులు, వృద్ధులు, శిశువులు, కూలీలు, ట్రాఫిక్ పోలీసులకు వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.