News May 23, 2024
HYD: ఒక్క మెసేజ్‌తో రూ.11.20 లక్షలు స్వాహా

స్టాక్ మార్కెట్‌లో లాభాలిస్తామని ఓ గృహిణి నుంచి రూ.11.20 లక్షలను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. HYD నారాయణగూడకు చెందిన గృహిణికి స్టాక్ మార్కెట్‌లో లాభాలు వస్తాయని ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఉన్న లింకును క్లిక్ చేయగా ఒక యాప్ డౌన్‌లోడ్ అయింది. దాంట్లో మొదట కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.11.20 లక్షలు పెట్టుబడి పెట్టగా విత్ డ్రా అవ్వలేదు. బాధితురాలు CCSలో ఫిర్యాదు చేసింది.
Similar News
News March 16, 2026
HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

నగరంలో వీకెండ్ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.
News March 16, 2026
HYD: ఎమ్మెల్యే సాబ్.. లొల్లిజేశైనా సమస్య తెంపు!

‘‘పార్టీ ఏదైనా హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా ఆదరించారు. సిటీ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతోనే మీకు ఓటు వేశారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సిటీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు జరిగే అసెంబ్లీలో మీరు (సిటీ ఎమ్మెల్యేలు) గళం విప్పితే సర్కారు వింటుంది. అపుడు సమస్యలు పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. అందుకే MLA సాబ్ సభలో లొల్లిజేశైనా సమస్యను తెంపు’ అని నగరవాసులు కోరుతున్నారు.
News March 16, 2026
HYDలో అంతా మా ఇష్టం!

HYDలో గ్యాస్ కొరత వార్తలు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. బషీర్‌బాగ్‌లోని ఫుల్‌బాగ్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ ధరలు పెరిగాయనే నెపంతో ప్రతి ఫుడ్ ఐటమ్ మీద అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా పెంచుతోన్న ధరలతో సామాన్య ప్రజలు వాపోతున్నారు. కట్టడి చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.


