News May 13, 2024
HYD: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. HYD ఎంపీ స్థానంలో 2019లో 44.84 శాతం పోలింగ్ నమోదవగా మల్కాజిగిరిలో 49.63, సికింద్రాబాద్‌లో 46.50, చేవెళ్లలో 53.25 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.
Similar News
News December 15, 2025
HYD: ఫేమస్ బుక్స్.. షార్ట్ రివ్యూస్!

ఈనెల 19నుంచి NTRస్టేడియంలో బుక్ ఫెయిర్ ఉంది. ఏబుక్స్ కొనాలని యోచిస్తుంటే? మీకోసమే.
➥ఫ్రెడ్రిక్ నిషే ఫిలాసఫీ ‘మనిషి ఒంటేలాంటోండు..మోకరిల్లి బాధ్యతల బరువును భుజానేసుకొని జీవితం భారమైందని ఏడుస్తాడు’అని చెప్పింది ఈయనే. మనిషి సూపర్‌మ్యాన్ కాగలడని ఏకాంతంగా గడిపిన ‘జరతూస్త్రా’తో ప్రపంచానికి చెప్పారు. మనిషి బానిస గోడలను బద్దలుకొట్టే ఆలోచనలు పుట్టిస్తారు. నిషేను మరోలా అర్థం చేసుకుని హిట్లర్ WW ప్రకటించారు.
News December 15, 2025
HYD: న్యూ ఇయర్ కోసం వెయిటింగా? మీకోసమే

HYD న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. DEC 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు పబ్‌లు, బార్‌లు, హోటళ్లలో CCకెమెరాలు, సెక్యూరిటీ తప్పనిసరి. మైనర్లకు ఎంట్రీ, మద్యం నిషేధం, డీజేలు, అశ్లీల నృత్యాలు, రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్. మద్యం తాగి వాహనం నడిపితే కేసులు, జరిమానా, జైలు శిక్ష విధిస్తామని CP సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్లు రాత్రి 12:30లోపు ముగించాలన్నారు.
News December 15, 2025
ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా జాగ్రత్తలు తీసుకోండి: కిషన్ రెడ్డి

ఫిలింనగర్‌లో పర్వతాంజనేయ స్వామి ఆలయాన్ని ఆనుకొని భూములు అన్యాక్రాంతం అయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆలయం చుట్టూ ప్రహారీ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. ఆదివారం వినాయకనగర్ పర్వతాంజనేయ స్వామి ఆలయంలో పవర్ బోర్‌వెల్స్‌ను ఆయన ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.


