News December 1, 2025
HYD: ఓన్లీ ప్రాఫిట్ నో లాస్ పేరుతో రూ.1.87కోట్ల మోసం

స్టాక్ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్‌కు చెందిన ముఖేశ్ పాఠక్‌పై సీసీఎస్ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్ తెలిపింది.
Similar News
News February 19, 2026
మన సిద్ధిపేటలో రేపే మెగా సెమినార్

టెన్త్ తర్వాత విద్యార్థులు వేసే తొలి అడుగుపై పేరెంట్స్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. మన సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో శుక్రవారం మెగా సెమినార్ జరగనుంది. రేపు సాయంత్రం.6 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. కావున తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు.
News February 19, 2026
MBNR: అంబేడ్కర్ వర్సిటీ 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

మహబూబ్‌నగర్ MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సైన్స్, కంప్యూటర్ విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. 80% హాజరు ఉన్న విద్యార్థులనే అనుమతిస్తారని ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మావతి తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించాలని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ సూచించారు.
News February 19, 2026
వనపర్తి: ‘ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు, పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ యాదయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు సూచనల ప్రకారం పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ అధికారి అంజయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


