News August 13, 2025

HYD: ఓపెన్ డిగ్రీ, PGలో అడ్మిషన్లు

image

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీ చేయాలనుకునేవారికి ముఖ్య గమనిక. అడ్మిషన్లకు నేడు చివరి తేదీ అని అధికారులు తెలిపారు. జూన్ 14న వెలువడగా ఆగస్టు 13 వరకు అడ్మిషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు. రెగ్యూలర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. SHARE IT

Similar News

News March 13, 2026

SEBI హోల్ టైమ్ మెంబర్‌గా తెలుగు వ్యక్తి!

image

స్టాక్ మార్కెట్లను పర్యవేక్షించే సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో తెలుగు వ్యక్తికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. SEBI హోల్ టైమ్ మెంబర్‌గా మాజీ IDAS అధికారి కేవీ రమణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా SEBIలో పార్ట్‌టైమ్ మెంబర్‌గా పనిచేశారు. సెబీ నిర్ణయాల్లో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు.

News March 13, 2026

పరీక్షల్లో అప్రమత్తత అవసరం: డీఈఓ లలిత

image

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు డీఈఓ లలిత తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 6,949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్, OMR షీట్ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదువుకున్న తర్వాతే సమాధానాలు రాయాలని, ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

News March 13, 2026

నిర్మల్: ‘గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి’

image

నిర్మల్ జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ భోజన్న సూచించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా సకాలంలో హాజరుకావాలన్నారు. ఈసారి ‘నిమిషం నిబంధన’ అమలులో లేదని, 9.35 నిమిషాల వరకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, 9.30 గంటలకే విద్యార్థులు తమ గదుల్లో ఉండాలని ఆయన ఆదేశించారు.