News November 30, 2025

HYD: ఓపెన్ ప్లాట్లు, FLATS కొనే ప్రజలకు ఇబ్బందులు!

image

ఓపెన్ ప్లాట్లు, FLATS కొనే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. HMDA అనుమతులు ఉన్నా సరే.. అవి ‘బిల్డ్ నౌ’ ఆన్లైన్ సైట్‌లో చూపించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి విషయానికి కార్యాలయంలో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘బిల్డ్ నౌ’ సైట్‌లో వివరాలు అప్డేట్ కాకపోవడంతో, అందుకే కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. దీనిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News February 19, 2026

VJA: బడుగు జీవులను దోచుకుంటున్నారు..!

image

విజయవాడ కనకదుర్గ ఆలయంలో అవుట్‌ సోర్సింగ్ సిబ్బందిని నియమించే మ్యాన్‌పవర్ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జీతం చెప్పేది ఒకటి.. ఇచ్చేది మరోలా ఉందంటున్నారు. PF, ESI చెల్లెస్తున్నారో లేదో కూడా సమాధానం చెప్పట్లేదంటున్నారు. ఆలయంలో సుమారు 480 మంది విధులు నిర్వహిస్తున్నారు. రోజుకి 9-10 గంటలు నుంచుని విధులు నిర్వహిస్తున్న బడుగుజీవులను దోచుకుంటున్నారంటున్నారు

News February 19, 2026

సూర్యాపేట: బడా నేతల వార్డుల్లోనూ BRSకు తప్పని ఓటమి

image

దశాబ్ద కాలంగా కీలక నామినేటెడ్ పదవులు అనుభవించిన బీఆర్ఎస్ నేతలకు ఈ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. జిల్లా స్థాయి బాధ్యతల్లో ఉన్న నేతతో పాటు, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ తమ సొంత వార్డుల్లోనూ పార్టీని గెలిపించుకోలేక పోయారు. మున్సిపల్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ల వార్డులైన 9, 36, 38లోనూ పార్టీకి పరాభవం తప్పలేదు. జడ్పీ వైస్ ఛైర్మన్ నివాసం ఉండే 46వ వార్డులోనూ ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

News February 19, 2026

కర్నూలు జిల్లా ప్రజల పక్షాన అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే

image

దేశంలోని ఎక్కువగా వలసలు వెళ్లే రైతు కూలీలున్న ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాల్లో మరిన్ని KGBVలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పార్థసారథి కోరారు. వైసీపీ హయాంలో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో 25 సీజనల్ హాస్టళ్లుంటే.. వాటిని కేవలం 6 నెలల్లోనే 78కి పెంచామని చెప్పారు. అందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. ఇవి సరిపోవని, ఇంకా కావాలని కోరారు.