News August 19, 2025
HYD: ఓయూలో ఘనంగా స్నాతకోత్సవం!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో 84వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం మొత్తం 121 బంగారు పతకాలను ఓయూ ఛాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్ డాక్టర్ నారాయణన్, ఓయూ ఉపకులపతి మొలుగరం ఆచార్య కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఆయా విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన 1,261 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు.
Similar News
News January 15, 2026
ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు: రాజ్ ఠాక్రే

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు వాడుతున్నారని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. సిస్టమ్‌ను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికే ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడగకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.
News January 15, 2026
మీ ఇంటి గోవులను రేపు ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
News January 15, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌లోని <


