News May 7, 2025
HYD: ఓయూలో పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్‌డీ (పీహెచ్‌డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేసుకున్నట్లు వివరించారు. తిరిగి నిర్వహించబోయే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.SHARE IT
Similar News
News February 18, 2026
పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన్ను పికప్ చేసుకునేందుకు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తుండగా కాన్వాయ్‌లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో చివరి వాహనం దెబ్బతింది. ప్రమాద సమయంలో కాన్వాయ్‌లో పవన్ లేకపోవడం, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
News February 18, 2026
బ్యాటరీ రెంటల్ కార్లు.. ఏంటీ విధానం?

ఈ విధానంలో కస్టమర్ కేవలం కారే కొనుగోలు చేస్తాడు. బ్యాటరీ కాదు. బ్యాటరీని షోరూమ్ రెంట్‌కి ఇస్తుంది. నెలకు మినిమం అమౌంట్ డిపాజిట్ చేసుకుంటుంది. ఆపై ఎన్ని కి.మీ ఎక్కువ తిరిగితే దానికి ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తుంది. కారు కొనుగోలు సమయంలో కస్టమర్‌పై అధిక భారం పడొద్దనే కంపెనీలు బ్యాటరీ రెంటల్ విధానాన్ని తీసుకొచ్చాయి. మార్కెట్లో ఇప్పటికే MG విండ్సర్ ఇలాగే రన్ అవుతుండగా తాజాగా మారుతీ <<19171974>>ఈ-విటారా<<>> వచ్చింది.
News February 18, 2026
కర్నూలు: 14 మంది విద్యార్థుల డిబార్

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 14 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు ఉపకులపతి వెంకట బసవరావు తెలిపారు. వీరంతా మంగళవారం జరిగిన పరీక్షలో చూచిరాతకు పాల్పడ్డారని చెప్పారు. KDC, సెయింట్ జోసఫ్, STBC, రావుస్, GDC నంద్యాల, జ్యోతిర్మయి, శ్రీ వేంకటేశ్వర, సిద్ధార్థ, నందరాం, ఆలూరు, సాయిరాం, తదితర కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు డిబార్ అయ్యారు.


