News March 11, 2025
HYD: ఓయూలో భోజనంలో బ్లేడ్

OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్‌లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లోకైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.
Similar News
News January 21, 2026
ఉట్నూర్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్

ఉట్నూర్ మండలం కుమ్మరి తాండలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గిరిజన బిడ్డలు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనభ్యసించి, దేశ భవిష్యత్తును నిర్మించే ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారు.
News January 21, 2026
తిరుపతిలో 60 కేసుల నమోదు

తిరుపతి నగరంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. డ్రంకెన్ డ్రైవ్‌పై 37, ట్రాఫిక్ ఉల్లంఘనపై 23 కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు మొత్తం రూ.3,81,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన ఒక్కొక్కరికి రూ.10వేలు, నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.500 చొప్పున జరిమానా వేశారు.
News January 21, 2026
NLG: మహిళా సాధికారతే లక్ష్యం: కలెక్టర్ చంద్రశేఖర్

గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు డిపిఎంలు, ఏపీఎంలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల బలోపేతం, ‘ఉల్లాస్ అక్షరమాల’ ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాలు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలన్నారు.


