News October 26, 2024
HYD: ఓయూ దూర విద్యలో దరఖాస్తులకు ఆహ్వానం
దూర విద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 5వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 9న జరగనుందని తెలిపారు. వెబ్‌సైట్: www.ouadmissions.com
Similar News
News November 23, 2024
జూబ్లీహిల్స్: శివలింగం నుదుటిపై సింధూరమైన సూర్యకిరణాలు
జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని శ్రీ వీరాంజనేయ సన్నిధిలో అద్భుతం చోటు చేసుకుంది. శివునికి అభిషేకం చేస్తున్న సమయంలో సూర్యకిరణాలు శివలింగం నుదుటిపై సింధూరంలా కనిపించాయి. సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద పడి.. సింధూరంలో కనిపించిందని రామంజి గురుస్వామి, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారన్నారు.
News November 23, 2024
జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్
సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.
News November 23, 2024
HYD: మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటారా?: సాయి
అబద్ధాలు మాట్లాడడంలో KCR, హరీశ్‌రావును KTR మించిపోయాడని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. ఈరోజు HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KTR దిమాక్ లేకుండా మాట్లాడుతున్నాడని, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలంటూ ట్వీట్స్ చేస్తున్నాడని అన్నారు. చేపల పెంపకంపై గత BRS ప్రభుత్వం వల్ల కాలేదని.. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే అవార్డు వచ్చిందని తెలిపారు.