News March 26, 2024
HYD: ఔటర్ రింగు రోడ్డుపై అద్దెకు సైకిళ్లు

సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గ్రేటర్ HYD చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. సొంత సైకిళ్లు లేని వారి కోసం అద్దెకు సైకిల్ స్టేషన్‌ను నార్సింగి హబ్‌లో ఏర్పాటు చేసి సుమారు 200 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. అద్దెకు ఇచ్చే సైకిల్‌కు గంటలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News February 12, 2026
ఓహో.. ‘బేగంపేట’కు ఆ పేరు ఇలా వచ్చిందా?

బేగంపేటకు ఉన్న చారిత్రక నేపథ్యం నిజాం కాలానికి చెందింది. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ తన కుమార్తె బషీర్ ఉన్నిసా బేగంకు ఉమ్రన్ అమిర్‌తో వివాహం చేశారు. ఆ సందర్భంగా కట్నంగా ఒక విలువైన స్థలాన్ని ఆమెకు దానం చేశారు. ఆ భూమి బషీర్ ఉన్నిసా బేగం పేరిట నమోదు కావడంతోనే కాలక్రమేణా ఆ ప్రాంతం ‘బేగంపేట’గా ప్రసిద్ధి చెందింది. నిజాం రాజవంశ వైభవానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
News February 12, 2026
HYD: ఆస్తిని లాక్కొని.. తండ్రిని గెంటేసిన కూతుర్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని కుమార్తెలే వీధిన పడేసిన అమానవీయ ఘటన మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్‌లో కలకలం రేపింది. మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం తనకున్న 130 గజాల స్థలాన్ని ఇద్దరు కుమార్తెల పేరిట రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వారు ఆయన్ని ఇంటి నుంచి గెంటివేశారు. తిండి పెట్టకుండా బయటకు పంపడంతో బాధితుడు కుమార్తెల ఇంటి ముందే ఆందోళనకు దిగారు. ప్రస్తుతం బస్తీవాసులే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.
News February 12, 2026
HYD: ఆన్‌లైన్‌లో కీసర గుట్ట దర్శనం టికెట్లు

కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని ఆలయ EO కట్టా సుధాకర్ రెడ్డి, ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 14న స్వామివారి కళ్యాణానికి సంబంధించిన టికెట్లు, VIP దర్శనం, అభిషేకానికి సంబంధించిన టికెట్లు keesaragutta.telangana.gov.inలో పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని EO సూచించారు.
SHARE IT


