News June 17, 2024

HYD: కట్ట మైసమ్మ గుడిలోకి వరద నీరు 

image

ఫిలింనగర్ బసవతారకనగర్‌ బస్తీలో సా. కుండపోత వర్షం కురిసింది. ఇటీవల వినాయక్‌నగర్ నుంచి బాలిరెడ్డినగర్‌ మీదుగా పారామౌంట్‌హిల్స్ ఏరియా వరకు రహదారి పనులు చేపట్టినా.. పూర్తి చేయలేదు. దీంతో రహదారి మీద నీళ్లు నిలిచాయి. పక్కనే ఉన్న కట్ట మైసమ్మ గుడిలోకి భారీగా వరద చేరడంతో ప్రహరీ కూలి ముగ్గురికి గాయాలు అయ్యాయి. గుడి సగానికి పైగా మునిగిపోయిందని.. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు కోరుతున్నారు.

Similar News

News January 23, 2026

GHMCలో భారీ మార్పులు!

image

GHMC తన IT వ్యవస్థను మారుస్తోంది. హాజరు, పన్నులకే పరిమితం కాకుండా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌తో కూడిన కొత్త వ్యవస్థను అమల్లోకి తెస్తోంది. డేటా ఇంటిగ్రిటీని కాపాడేందుకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా సిస్టమ్ ఇంటిగ్రేటర్‌ను ఎంపిక చేయనున్నారు. ఫీల్డ్ లెవల్ యాక్టివిటీస్‌ను రియల్ టైమ్‌లో చూసేలా ఈ ప్లాట్‌ఫారమ్ డిజైన్ చేశారు. దీంతో ఫీల్డ్ రిపోర్టుల్లో తప్పుడు సమాచారానికి తావుండదు.

News January 23, 2026

HYD: ఈ వెంకన్న భక్తుల మాటలు వింటాడట..?

image

మేడ్చల్‌లోని ఎంసీపల్లి ORR వద్దగల ఉద్దేమర్రి వేంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుడిలో వెంకన్న భక్తుల మాటలు వింటాడని ప్రతీతి. ఆయన ఆశీస్సుల కోసం జిల్లాలు దాటి ఇక్కడికి వచ్చిన భక్తులు, తమ కోర్కెను తీర్చాలని, కుటుంబ సభ్యులందరూ బాగుండాలని వేడుకుంటుంటారు. ‘వెంకన్న స్వామి.. వేయి దండాలు నీకు’ అంటూ శరణు కోరుతుంటారు. ఆ స్వామి మానసిక, ఆధ్యాత్మిక శక్తిని అందిస్తారని భక్తుల నమ్మకం.

News January 23, 2026

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ @240

image

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ శుక్రవారం ఉప్పరపల్లిలో తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే గాలి నాణ్యత నిన్న తగ్గి ఇవాళ కాస్త పెరిగింది.