News September 10, 2025
HYD: కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జాతర: మంత్రి

జూబ్లీహిల్స్‌లో BRS గెలిచినా లాభం లేదని, ప్రభుత్వం మారదని, ఓటర్లంతా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు HYDలో KTR వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జాతర సాధ్యమని, BRSఎన్నికల్లో బీరు-బిర్యానీ సంస్కృతి తెచ్చిందన్నారు. జూబ్లిహిల్స్‌లో చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటిని కూల్చింది KTR కాదా అని ప్రశ్నించారు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.
Similar News
News December 16, 2025
ఖమ్మం: పంచాయతీ పోరులో ‘నోటు’ స్వామ్యం

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అభివృద్ధి హామీల కంటే డబ్బు, మద్యం, తాయిలాల పంపిణీకే ప్రాధాన్యం ఇవ్వడంతో పల్లె ఎన్నికలు ‘నోటుస్వామ్యం’లా మారాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.10 వేలు, మాంసం పంపిణీ చేశారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ రహిత ఎన్నికల్లో జిల్లా నాయకుల ప్రచారం చర్చనీయాంశమైంది.
News December 16, 2025
హాట్ మెటల్ ఉత్పత్తిలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రికార్డ్

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం 6AM నుంచి సోమవారం 6AM వరకు బ్లాస్ట్‌ఫర్నేస్ 1, 2, 3 విభాగాల్లో 21,012 టన్నుల హాట్‌మెటల్ ఉత్పత్తి జరిగింది. ఒక రోజులో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఈ ఏడాది NOV 30న 20,440 టన్నుల ఉత్పత్తి జరిగింది. సంస్థ అభివృద్ధి పట్ల తమకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని ఉద్యోగ, కార్మిక వర్గాలు తెలిపాయి. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి.
News December 16, 2025
నేటి నుంచి పండగ (ధనుర్మాసం ) నెల ప్రారంభం

నేటి నుంచి ధనుర్మాసం రావడంతో పండగ నెల ప్రారంభం అయినట్లు ప్రముఖ పండితులు లోకా అనంత వెంకట మురళీధర్ శాస్త్రి తెలిపారు. జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ నిర్వహించనున్నట్లు చెప్పారు. మంచు తెరలు ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. పండుగ నెల ప్రారంభం కావడంతో ప్రతి ఇంటి ముందు రంగవల్లిలతో తీర్చిదిద్దునున్నారు. గుమగుమలాడే వివిధ రకాల పిండి వంటలు చేసే పనులు నిమగ్నం అవుతారు.


