News October 22, 2024
HYD: కాంగ్రెస్ పార్టీ వాళ్లే మతకలహాలను సృష్టించారు: ఈటల
ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ నేతలు మతకలహాలను సృష్టించారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ కేసులో హైదరాబాద్ మంటల్లో మాడిపోయిందని, వందల మంది చనిపోయారన్నారు. దానికి కారణం ఆ రోజు చెన్నారెడ్డిని దింపడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్లే మతకలహాలను సృష్టించారన్నారు.
Similar News
News November 10, 2024
FLASH: రేపు HYDలో నీళ్లు బంద్
రాజధాని వాసులకు ముఖ్య గమనిక. రేపు (నవరంబర్ 11న) నగరంలోని పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదు. వాటర్ పైప్‌లైన్ మరమ్మతుల దృష్ట్యా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నారు. అమీర్‌పేట, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి, KPHB, RCపురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్‌పూర్, జగద్గిరిగుట్ట పరిధి ఏరియాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
SHARE IT
News November 9, 2024
HYD: BRS, BJPపై మంత్రి పొన్నం ఫైర్
BRS, BJPపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈరోజు HYD నాంపల్లిలోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KCR, KTR, హరీశ్ రావును అరెస్ట్ చేస్తామని, జైలుకు పంపుతామని గతంలో బండి సంజయ్ అన్నారని గుర్తు చేశారు. కానీ తాము చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, బండి సంజయ్ సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. BRS, BJP ఒక్కటే అని, కులగణన, మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దని కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ను హెచ్చరించారు.
News November 9, 2024
HYD: శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు బుక్ చేసుకోండి!
పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు HYD నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. NOV 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని, ఏపీ పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులు ఉంటాయన్నారు.