News September 9, 2025
HYD: కాళోజి మాటలు అందరికీ స్ఫూర్తి కావాలి

పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమమే ఊపిరిగా కాళోజి జీవించారని పేర్కొన్నారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ఆయన చెప్పిన మాటలు అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.
Similar News
News December 17, 2025
చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి: సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా అధికారులకు CM దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా ఉంటారని తెలిపారు. మనం ఏం చేశామనే వివరాలు సమగ్రంగా ఉండాలని, నిరంతరం నేర్చుకునే పనిలో ఉండాలని అన్నారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని, జవాబుదారీతనం ఉండాలని పిలుపునిచ్చారు.
News December 17, 2025
రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు!

TG: పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండటంతో పరిషత్(MPTC, జడ్పీ) ఎలక్షన్స్‌కు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ ఫైల్‌ను అధికారులు సీఎంకు పంపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పంచాయతీ తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సీఎం ఆమోదిస్తే ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల, JANలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.
News December 17, 2025
మధ్యతరగతికి ‘వెండి’ వెలుగులు

ప్రస్తుతం బంగారం ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో ఈ రోజుల్లో పేద, మధ్యతరగతి వారికి వెండి పెట్టుబడి మంచి అవకాశంగా మారింది. కిలో వెండి ధర ఒక్కరోజే <<18588447>>రూ.11 వేలు పెరిగి<<>> రూ.2,22,000కు చేరి మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. రాబోయే రోజుల్లో సిల్వర్ ధరలు మరింత ఎగబాకే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పోలిస్తే అందుబాటు ధరలో ఉన్న వెండిని కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.


