News November 20, 2025
HYD: కుర్రకారు.. డేటింగ్ యాప్స్‌తో జాగ్రత్త..!

డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకొని, నమ్మకం కలిగిన తర్వాత మత్తు పదార్థాల రుచి చూపించి, ఒక్కసారి సరదా పేరుతో యువతను గంజాయి సహా వివిధ రకాల డ్రగ్స్ వలయంలోకి లాగుతున్నట్లు HYDలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News January 13, 2026
కరీంనగర్: సమ్మక్క-సారక్క పలారముల్లో..!

ఉమ్మడి కరీంనగర్‌లో ప్రస్తుతం ఏ గల్లీకి వెళ్లినా ‘సమ్మక్క-సారక్క పలారముల్లో..!’ అని వినిపిస్తోంది. మేడారం జాతరకు వెళ్లడానికి ముందు కోడి, నిలువెత్తు బంగారం(బెల్లం)తో ఇంట్లోనే తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. ఆ తర్వాతే మేడారం వెళ్తారు. ఇంతకీ పలారం అంటే ఏంటనుకుంటున్నారా? కొబ్బరి కుడుక, బెల్లం, చెక్కర కలిపి చుట్టుపక్క వారిని పిలిచి ‘సమ్మక్క-సారక్క పలారం’ అని పంచిపెడతారు. ఇలా మీరు చేశారా?
News January 13, 2026
మీకు రక్తహీనత ఉందా? ఇలా చేయండి

* ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మొలకెత్తిన పప్పు ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి. * విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకోవాలి. * బీట్‌రూట్ తీసుకుంటే రక్తం శుభ్రపడటంతో పాటు ఐరన్, ప్రోటీన్‌లు ఎక్కువగా లభిస్తాయి. * నువ్వులను విడిగా, బెల్లంతో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. * తేనెలో ఐరన్,కాపర్, మాంగనీస్‌లు పుష్కలంగా ఉంటాయి. * అరటి, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు రక్తహీనతను నివారిస్తాయి.
News January 13, 2026
చలాన్లపై సీఎం రేవంత్‌ది చెత్త సలహా: బండి

TG: చలాన్ల విషయంలో 50% డిస్కౌంట్ ఇస్తామన్న CM రేవంత్ <<18838769>>మాట<<>> మార్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రక్షణకి ప్రాధాన్యమిస్తూ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయని అయితే చలాన్లు ఆటో డెబిట్ చేయాలనడం చెత్త సలహా అని మండిపడ్డారు. ఒకవేళ ఇదే కొనసాగిస్తామంటే ముందుగా మంత్రులు/నేతల బ్యాంక్ అకౌంట్లు లింక్ చేయాలన్నారు. PM మోదీ జన్ ధన్ అకౌంట్లు తీసుకొస్తే, కాంగ్రెస్ ప్రజల డబ్బులు లూటీ చేయాలని చూస్తోందన్నారు.


