News November 20, 2025

HYD: కుర్రకారు.. డేటింగ్ యాప్స్‌తో జాగ్రత్త..!

image

డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకొని, నమ్మకం కలిగిన తర్వాత మత్తు పదార్థాల రుచి చూపించి, ఒక్కసారి సరదా పేరుతో యువతను గంజాయి సహా వివిధ రకాల డ్రగ్స్ వలయంలోకి లాగుతున్నట్లు HYDలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News January 18, 2026

హైదరాబాద్ మళ్లీ ‘ఆమె’దే!

image

త్వరలో ఎన్నికలు జరగనున్న జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిలో మేయర్‌గా మరోసారి మహిళే ఎన్నిక కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఛైర్మన్లు, మేయర్లకు శనివారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పది మున్సిపల్ కార్పొరేషన్లకు గానూ జీహెచ్ఎంసీకి మహిళ (జనరల్) రిజర్వు కావడంతో రాబోయే పాలకమండలిలోనూ హైదరాబాద్‌లో మహిళే చక్రం తిప్పనున్నారు.

News January 18, 2026

కర్ణుడి దానగుణం: మానవత్వమే పరమార్థం

image

మహాభారత యుద్ధంలో కర్ణుడి దానపుణ్యమే అతడికి రక్షగా నిలిచింది. చివరి క్షణంలో కృష్ణుడు అడిగినప్పుడు కర్ణుడు తన పుణ్యఫలాన్ని కూడా దానమిచ్చాడు. వరం కోరమని అడగ్గా.. మరుజన్మలోనూ సాయం చేసే హృదయాన్నే కోరుకున్నాడు. ముక్తి కోసం దేవుడిని వెతకక్కర్లేదని, తోటివారికి సాయపడే గుణం ఉంటే ఆ దేవుడే మనల్ని చేరుకుంటాడని ఈ కథ నిరూపిస్తోంది. పరోపకారమే నిజమైన దైవారాధనని కర్ణుడి జీవితం చాటిచెబుతోంది.

News January 18, 2026

C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<>C-DOT<<>>) 10 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్/ రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.