News November 19, 2025

HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

image

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.

Similar News

News January 17, 2026

కొత్తగూడెం: పారదర్శకంగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు: కలెక్టర్

image

కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను శనివారం కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకతతో రిజర్వేషన్లను కేటాయించినట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. నిష్పక్షపాతంగా వార్డుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

News January 17, 2026

U-19WC: భారత్ స్కోర్ ఎంతంటే?

image

U-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టులో కెప్టెన్ ఆయుష్ మాత్రే(6) మరోసారి ఫెయిల్ అయ్యారు. మరో ఓపెనర్ సూర్యవంశీ 72, అభిజ్ఞాన్ కుందు 80 రన్స్‌తో రాణించారు. మధ్యలో వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచును 49 ఓవర్లకు కుదించారు. మరి భారత్ ఈ టార్గెట్‌ను కాపాడుకుంటుందా? COMMENT

News January 17, 2026

మద్దిలపాలెంలో బస్సు కింద పడి వ్యక్తి మృతి

image

విశాఖలోని మద్దిలపాలెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, స్కూటీ ఒకే దిశలో వెళ్తుండగా, స్కూటీ అదుపుతప్పి పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి బస్సు వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు.