News November 19, 2025
HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.
Similar News
News January 20, 2026
మెరుగైన శిక్షణతో విధుల్లో మరింత రాణించగలం: వరంగల్ సీపీ

పోలీస్ అధికారులు, సిబ్బంది మెరుగైన శిక్షణ పూర్తి చేయడం ద్వారా అప్పగించిన పనుల్లో మరింత రాణించగలమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శివ కుమార్ హైదరాబాద్ యూసుఫ్‌గూడలో నిర్వహించిన ఆరు నెలల ఆయుధ మరమ్మతులపై శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో శిక్షణా కేంద్రం నుంచి జారీ చేసిన ధ్రువ పత్రాన్ని శివకుమార్‌కు సీపీ అందజేశారు.
News January 20, 2026
ప్రజల దృష్టి మళ్లించేందుకు CM ఎత్తులు: లక్ష్మణ్

TG: ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న బాధ్యులు ఎవరో తేల్చకుండా CM రేవంత్ రెండేళ్లుగా దర్యాప్తు పేరిట కాలయాపన చేశారని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. ‘ప్రజల దృష్టి మళ్లించడానికి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్యాపింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాపింగ్‌పై కవిత చేసిన ఆరోపణలకు BRS సమాధానం చెప్పాలి’ అని ఢిల్లీలో ఆయన పేర్కొన్నారు. కలహాలతో BRS ముక్కలవుతుందని జోస్యం చెప్పారు.
News January 20, 2026
‘కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటును అడ్డుకోలేం’

కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ ప్రాంతాలను కార్పొరేషన్‌లో కలపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(ZC)కి విరుద్ధమని దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. అయితే ఏర్పాటును అడ్డుకోలేమని పేర్కొంటూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురు కావడంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.


