News November 19, 2025

HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

image

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.

Similar News

News January 17, 2026

ఇరాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే.. భారత్‌కు కష్టమేనా?

image

ఇరాన్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఇండియాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నామని యువరాజు రెజా పహ్లావి ప్రకటించారు. కానీ ఆయన తండ్రి షా మహ్మద్ గతంలో పాక్‌కు అనుకూలంగా ఉన్నారు. 1965, 1975 ఇండో-పాక్ యుద్ధాల్లో PAKకు మద్దతు తెలిపారు. ఇప్పుడు పహ్లావికి US సపోర్ట్ ఉంది. పాక్, US బంధం నేపథ్యంలో ఇరాన్ వాటికి తోడైతే మనకు కష్టమే. <<18876732>>చాబహార్ పోర్టు<<>> భవితవ్యంపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదముంది.

News January 17, 2026

మరికాసేపట్లో ఎంవీఎస్ మైదానానికి సీఎం రేవంత్

image

మహబూబ్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించి భారీ నిధులతో కూడిన ప్రాజెక్టులకు ఆయన ఇక్కడ నుంచి పునాది వేయనున్నారు. సభ కోసం మైదానానికి జనం భారీగా చేరుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.

News January 17, 2026

KNR: 15 మున్సిపాలిటీలకు రిజర్వేషన్ల ఖరారు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
కరీంనగర్ కార్పొరేషన్ – BC(జనరల్)
జమ్మికుంట – SC(జనరల్)
హుజురాబాద్ – SC మహిళ, చొప్పదండి – SC మహిళ
రామగుండం కార్పొరేషన్ – SC(జనరల్)
పెద్దపల్లి – BC(జనరల్), మంథని – BC(జనరల్)
సుల్తానాబాద్ -జనరల్
సిరిసిల్ల – జనరల్ మహిళ
వేములవాడ – BC(జనరల్)
జగిత్యాల – BC మహిళ
కోరుట్ల – జనరల్ మహిళ
మెట్‌పల్లి – జనరల్
ధర్మపురి – జనరల్ మహిళ
రాయికల్ -జనరల్