News August 20, 2025

HYD: కేబుల్ వైర్లు తెగాయి.. సేవలు నిలిచాయి

image

రామంతపూర్, అంబర్‌పేట్ విద్యుత్ ప్రమాదాలతో విద్యుత్‌శాఖ చేపట్టిన చర్యలతో నగర వ్యాప్తంగా కేబుల్ వైర్లు ఎక్కికక్కడ కట్ అవుతున్నాయి. దీంతో వైర్ల ద్వారా నడిచే ప్రసారాలు నిలిచిపోయాయి. అత్యవసరం ఉన్నవారి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు మేడ్చల్ వాసి కర్కి రమేశ్ తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాక కేబుల్ వైర్ల తొలగింపు చేపట్టాలని కోరారు. సిబ్బంది వాహనాల్లో భారీగా తొలగించిన కేబుల్ వైర్లను తరలిస్తున్నారు.

Similar News

News January 17, 2026

IIIT హైదరాబాద్ బంపర్ ఆఫర్: ఇంటి నుంచే డేటా సైన్స్‌లో మాస్టర్స్!

image

IIIT-H వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం యూజీసీ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ఎంఎస్సీ డేటా సైన్స్‌ను లాంచ్ చేసింది. ప్రవేశ పరీక్ష లేకుండానే అడ్మిషన్ పొందే ఈ రెండేళ్ల కోర్సును, ఉద్యోగం చేస్తూనే నాలుగేళ్లలోపు పూర్తి చేయవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12లోపు dfl.iiit.ac.in లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.4 లక్షల ఫీజు. ఏప్రిల్ 6న తరగతులు ప్రారంభం కానున్నాయి.
SHARE IT

News January 17, 2026

హైదరాబాద్‌లో ‘ఆమె’దే హవా!

image

SEC నిబంధనల ప్రకారం GHMC మేయర్ పదవి మహిళా (జనరల్) కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. గతంలో MCHకు రాణి కుముదిని దేవి తొలి మహిళా మేయర్‌. ఆ తరువాత సరోజినీ, కుముద్ నాయక్ నగరాన్ని పాలించారు. GHMC ఏర్పడ్డాక 2007లో TDP నుంచి సరస్వతి దేవి మేయర్‌ అయ్యారు. ఆ తర్వాత బండ కార్తీక రెడ్డి సేవలు అందించగా, ప్రస్తుతం గద్వాల్ విజయలక్ష్మి 2021 నుంచి కొనసాగుతున్నారు. ఇలా మేయర్ పీఠంపై మహిళల ముద్ర ఎప్పట్నుంచో ఉంది!

News January 17, 2026

GHMC: 300 డివిజన్ల ‘మెగా’ రిజర్వేషన్లు.. పక్కా గణాంకాలు

image

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మునిసిపాలిటీలతో ఏర్పడిన 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసింది. ఇందులో ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, బీసీలకు 122 డివిజన్లు కేటాయించారు. మిగిలిన 150లో జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వ్‌డ్‌కు 74 దక్కాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్యూమరేషన్ బ్లాకుల (EB) ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను క్రోడీకరిస్తూ వార్డుల వారీ కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.