News March 25, 2024

HYD: గాంధీలో గర్భిణులకు కొండంత అండగా వైద్యం!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని MCH భవనంలో పిల్లలకు, గర్భిణులకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 600 నుంచి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నట్లు డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. 300 నుంచి 400 వరకు గైనిక్ సమస్యలు ఉన్నవారు ఓపీ తీసుకుంటున్నారని అన్నారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనాలకు మాత శిశు సంరక్షణ భవనాలకు అనుసంధానం చేసేలా స్కైవాక్ వంతెన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 5, 2024

HYD: మీసేవ 14వ వార్షికోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

image

HYDలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన మీ సేవ 14వ వార్షికోత్సవంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. మీ సేవ కేంద్రాలలో 150కిపైగా ప్రభుత్వ, 600 ప్రైవేట్ సంబంధిత ఆన్‌లైన్‌ చెల్లింపుల సేవలు సులువుగా అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మీ సేవ కేంద్రాల ఏజెంట్లు పాల్గొన్నారు.

News November 5, 2024

RR: రేపటి నుంచి సర్వే.. ఇవి దగ్గర ఉంచుకోండి!

image

సమగ్ర ఇంటింటి సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. 56 ప్రధాన, 19 అనుబంధ మొత్తం కలిపి 75 ప్రశ్నలుంటాయి. ఆధార్ కార్డులు, రైతులయితే అదనంగా ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను దగ్గర పెట్టుకుంటే సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వేలో ఫొటోలు తీయడం, పత్రాలు అడగం వంటివి చేయరు. ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.

News November 5, 2024

HYD: మతోన్మాదానికి వ్యతిరేకంగా సదస్సులు

image

HYDలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలోని ఎంబీ భవన్‌లో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అభ్యుదయ వాదులతో సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని తీర్మానించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ నెల 15 నుంచి నెల రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని, బీజేపీ, RSS దేశంలో మతోన్మాదంతో విధ్వంసానికి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు.