News July 7, 2024

HYD: గోల్కొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు

image

భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం లంగర్‌హౌజ్‌ చౌరస్తాలో వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ MLA దానం, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లంగర్ గౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు ప్రారంభించారు.

Similar News

News December 14, 2025

చేవెళ్ల: కూతురుకు ఓటేసి.. తండ్రి మృతి

image

ఎన్నికల్లో పోటీచేసిన తన కూతురుకి ఓటు వేసిన ఓ తండ్రి కుప్పకూలాడు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని 14వ వార్డులో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు సోలిపేట బుచ్చయ్య (70) చనిపోయారు. ఆలూరు పంచాయతీకి అనుబంధ గ్రామం వెంకన్నగూడ 14వ వార్డులో ఆయన కుమార్తె రాములమ్మ వార్డు సభ్యురాలుగా పోటీలో ఉంది. ఓటు వేసి వస్తుండగా వృద్ధుడు కుప్పకూలి మృతి చెందాడు. అతని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

News December 14, 2025

చేవెళ్ల: సర్పంచ్ ఏకగ్రీవం.. ఒకే వార్డుకు ఎన్నిక.. ఫలితం ఉప సర్పంచ్

image

చేవెళ్ల మండలం చన్వెల్లి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైన విషయం విధితమే. ఈ పంచాయతీ పరిధిలోని మొత్తం 10 వార్డులు ఉండగా 9 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 8వ వార్డు జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు సుధాకర్(SC)తో పాటు ఓసీ అభ్యర్థి పి.దీపక్ రెడ్డి పోటీ పడ్డారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో దీపక్ రెడ్డి విజయం సాధించారు. ఉప సర్పంచ్‌గా అతను ఎన్నికయ్యారు.

News December 14, 2025

RR: ఆమనగల్లు(M) శంకరకొండ సర్పంచ్‌‌గా రాములు

image

ఆమనగల్లు మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శంకరకొండ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన రాములు 101 ఓట్లతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.