News September 12, 2025

HYD- గోవాకు ఎగిరిపోదాం పదా బ్రో

image

పర్యాటక ప్రేమికుల కోసం IRCTC కొత్త ఎయిర్ ప్యాకేజీలు ప్రకటించింది. HYD నుంచి వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణికులను తీసుకెళ్లనుంది. 4, 5, 6, 8 రోజుల ప్యాకేజీలు తీసుకొచ్చింది. గోవా, గుజరాత్, కశ్మీర్, మేఘాలయ, కర్ణాకట, అండమాన్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలను చూపించనుంది. వీటితోపాటు థాయిలాండ్, శ్రీలంక దేశాలు కూడా ఉన్నాయి. వివరాలకు 040-27702407, 9701360701 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

Similar News

News December 16, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,520 తగ్గి రూ.1,33,860కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,400 పతనమై రూ.1,22,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,11,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 16, 2025

EVMలతోనే 4 సార్లు గెలిచా: సుప్రియా సూలే

image

EVMలపై ప్రతిపక్షాలు రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్న వేళ NCP(SP) ఎంపీ సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటితోనే తాను 4 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యానని, అందుకే ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు. LSలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. EVMలు, VVPATలను ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు EVMలను దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని హోంమంత్రి అమిత్‌ షా గుర్తుచేశారు.

News December 16, 2025

నేడు సీఎం చంద్రబాబు బిజీ డే షెడ్యూల్‌

image

@ 10:15 గంటలకు సచివాలయానికి చేరుకున్న సీఎం, రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు.
@ మధ్యాహ్నం 3:15 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు.
@ సాయంత్రం 4:55 గంటలకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌కు చేరుకున్నారు. 5 గంటలకు కొత్తగా నియామకమైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొంటారు.
@ రాత్రి 7.20 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకుంటారు.